ఏపీపీఎస్సీ 31 గెజిటెడ్ పోస్టులకు నోటిఫికేషన్

By | February 28, 2019
కడప జిల్లాలో 373 అంగన్‌వాడీ పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 31 గెజిటెడ్ పోస్టుల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది.

Jobsవిభాగాల వారీ ఖాళీలు: అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్-4, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్-3, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్-2, సివిల్ అసిస్టెంట్ సర్జన్-9, జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్-6, అసిస్టెంట్ డెరైక్టర్ ఇన్ ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్-2, అసిస్టెంట్ కెమిస్ట్-1, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్-1, రాయల్టీ ఇన్‌స్పెక్టర్-2, టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్-1.

అర్హత: పోస్టులను బట్టి బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీబీఎస్, సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్, పీజీ డిప్లొమా, ఎంఎస్సీ ఉత్తీర్ణత.

వయసు: జులై 1, 2019 నాటికి జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుకు గరిష్టంగా 52 ఏళ్లు మించకూడదు. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. మిగిలిన వాటికి 18-42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.250, ఎగ్జామ్ ఫీజు రూ.120 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, నిరుద్యోగ యువత, తెల్లరేషన్ కార్డు దారులకు ఎగ్జామ్ ఫీజు ఉండదు.

దరఖాస్తు ప్రారంభం: మార్చి 26, 2019.

దరఖాస్తుకు చివరితేదీ: ఏప్రిల్ 16, 2019.

ఫీజు చెల్లించుటకు చివరితేదీ: ఏప్రిల్ 15, 2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://psc.ap.gov.in

Gazetted posts Andhra pradesh public service commission APPSC Gazetted posts notification 31 Gazetted posts in AP APPSC Gazetted postsapplications Assistant social welfare officer posts

  •  
    27
    Shares
  • 27
  •  
  •  
  •  
  •