ONGC recruitment 2019 ఓఎన్జీసీలో 750కి పైగా ఉద్యోగ ఖాళీల భర్తీ

By | February 14, 2019
ONGC recruitment 2019

ONGC recruitment 2019 | ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీసీ)లో కొత్త ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రకటన వెలువడింది. ఓఎన్జీసీలో ఏయే ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నారో ongcindia.com లో పూర్తి సమాచారాన్ని ఉంచారు.

ONGC recruitment 2019: నిరుద్యోగులకు శుభవార్త. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీసీ)లో కొత్త ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రకటన వెలువడింది. ఓఎన్జీసీలో ఏయే ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నారో ongcindia.comలో పూర్తి సమాచారాన్ని ఉంచారు. దాదాపు 750 ఉద్యోగాలకు సంబంధించి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. పదో తరగతి, అంతకు పైగా ఉద్యోగ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఓఎన్జీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నారు.

భర్తీ చేయనున్న పోస్టులు:

టెక్నికల్ అసిస్టంట్ జీడీ.3(కెమిస్ట్రీ) పోస్టులు 19, అసిస్టంట్ టెక్నీషియన్(సివిల్) పోస్టులు 7, అసిస్టంట్ టెక్నీషియన్(ఎలక్ట్రికల్) పోస్టులు 38, అసిస్టంట్ టెక్నీషియన్(ఎలక్ట్రానిక్స్) పోస్టులు 19, అసిస్టెంట్ టెక్నీషియన్(ఇన్‌స్ట్రుమెంటేషన్) పోస్టులు 25 పోస్టులకు ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నారు. అలాగే అసిస్టెంట్ టెక్నీషియన్(ప్రొడక్షన్)లో అత్యధికంగా 132 పోస్టులకు నియామకాలు చేపట్టనున్నారు. మొత్తం 40 విభాగాల్లో 750కి పైగా పోస్టులకు సంబంధించి ఈ నియామకాలు చేపట్టనుంది ఓఎన్జీసీ.


ONGC recruitment 2019: ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: జనవరి 31, 2019; 10.00 గంటలు
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ చివరితేదీ: ఫిబ్రవరి 20, 2019; 18.00 గంటలుకంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: మార్చి 2019 చివరి వారంలో జరిగే అవకాశం

జీతభత్యాలు ఎంత?

ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు రూ.30 వేలకు పైగా నెలసరి జీతభత్యాలు ఉంటాయి.

దరఖాస్తు చేసుకోవడం ఎలా?
ఓఎన్జీసీ వెబ్‌సైట్‌లోని లింక్ ద్వారా అర్హులైన అభ్యర్థులు సంబంధిత పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. పరీక్షలకు సంబంధించిన వివరాలను కూడా వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. సరైన వివరాలు ఇవ్వని అభ్యర్థుల దరఖాస్తులను నిరాకరిస్తారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •